గండికోట జలాశయంలో మంగళవారం 26. 25 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గండికోట జలాశయంలో 695. 10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. గండికోట జలాశయంలోకి ఇన్ఫ్లో ఏమి లేదని గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌కు విడుదల చేసిన నీటిని నిలుపుదల చేసినట్లు జల వనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.