తమకు కేటాయించిన చెత్తసేకరణ వాహనాలలో వేయకుండా రోడ్లపై వేస్తే ప్రతి ఒక్కరికి జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హెచ్చరించారు. చెత్త వేసిన షాపులను ఆదివారం గుర్తించి రూ. 10వేల వరకు జరిమానా విధించారు. రాత్రనకా, పగలనకా కష్టపడి పనిచేసే పురపాలక సిబ్బందికి సహకరించాలని కోరారు. చాలా మంది షాపుల యజమానులు అంగడి లైసెన్సులు తీసుకోలేదన్నారు. వారందరు వారంలోగా తీసుకోవాలని హెచ్చరించారు.