బద్వేలు పురపాలక సంఘంలోనీ పలు సచివాలయాల పరిధిలో పెన్షన్ పంపిణీ మునిసిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని పూసలవాడలో, గాంధీ నగర్ సచివాలయాల పరిధిలో పెన్షన్ పంపిణీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెన్షన్ సజావుగా జరిగేలా సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.