చంద్రన్న బీమా పథకాన్ని ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానా లేక పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ద్వారా అమలు చేయాలా? అని ఆలోచిస్తున్నారట. ఈ రెండు విధానాలను రూపొందించింది ప్రభుత్వం ముందు ఉంచారు. కాగా, 2014-19 మధ్య ఈ పథకాన్ని సెర్ప్ పరిధిలో అమలు చేశారు. ఏడాదికి దాదాపు 85 వేల క్లెయిమ్‌లను పరిష్కరించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేది.