వినుకొండ: బాలల హక్కుల పరిరక్షణకు అవగాహన
వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బాలల హక్కుల పరిరక్షణకై అవగాహన కల్పించాలని వినుకొండ మండలంలోని, వివిధ డిపార్ట్మెంట్ వారికి, వినుకొండ ఐసీడీఎస్, సీడీపీవో అనురాధ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తాము పనిచేస్తున్న ప్రాంతాలలో బాలల హక్కుల గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించి బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండివో పుట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.