ఏపీ శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నియమించారు. అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, విప్ లుగా తెలుగుదేశం నుంచి బెందాళం అశోక్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, థామస్, తోయక జగదీశ్వరి, కాలవ శ్రీనివాసులు, రెడ్డప్పగారి మాధవీ రెడ్డి, పీజీవీఆర్ నాయుడు (గణబాబు), తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావులను నియమించారు.