తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ ను పోలీసులు ఛేదించారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని నమ్మించిన కేటుగాళ్ళు.. ఒక్కొక్కరి దగ్గర నుంచి నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేశారు. గతేడాది జూలై 23న తమిళనాడులో ది డాంకీ ప్యాలెస్‌ను ప్రారంభించారు. ఆధిక లాభం పొందవచ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నారు.