ఇద్దరు కుమారులు అన్నం పెట్టకుండా ఇంటి నుంచి బయటకు గెంటివేశారని శావల్యాపురం మండలం మతుకుపల్లికి చెందిన ఏటుకూరి యోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులు ఆస్తిని వాళ్ల పేరిట రాయించుకున్నారని వాపోయారు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.