ఈపూరు మండలంలోని ఇనిమెళ్ల గ్రామంలో శుక్రవారం ఓ వివాహిత ఉరివేసుకొని మృతి చెందింది. పోలీసులు కథనం ప్రకారం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన చవల భూలక్ష్మి (35) కొద్దిరోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతుంది. అయితే వీటిని తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి 15 సవంత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.