గత వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఎమ్మెల్యే జీవీ తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ఏడాదైన సందర్భంగా సోమవారం ఆయన వినుకొండ లో ఒక ప్రకటన విడుదల చేశారు. దురుద్దేశంతో జగన్ కేసులు పెట్టి నిరంకుశంగా 53 రోజులు తెదేపా అధినేతను జైల్లో పెట్టినా తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రజల మద్దతుతో చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.