తాడికొండ: బాలుడి మృతిపై విద్యాశాఖ విచారణ

66பார்த்தது
తాడికొండ మండలం పొన్నెకల్లులో 9వ తరగతి విద్యార్థి సమీర్ ను తోటి విద్యార్ధులు కొట్టి చంపి బావిలో పడేసిన విషయం తెలిసిందే. కాగా ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి విచారణకు ఆదేశించారు. సోమవారం జిల్లా ఉప విద్యాధికారి వెంకటేశ్వరరావు పాఠశాల చేరుకొని విచారించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఘటనపై టీచర్లను అడిగి వివరాలను నమోదు చేసుకొని జిల్లా అధికారికి నివేదిక అందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி