కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ దీపం -2 పథకం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తాడికొండ అడ్డరోడ్డు వద్దకు వస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. నియోజక వర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.