బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వలన పొన్నూరు మండలంలో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురిశాయి. ఈ ఏడాది పొన్నూరు మండలంలో 12 వేల హెక్టార్లులో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులుగురువారం తెలిపారు. వర్ష ప్రభావం వలన మండలంలో చేతికొచ్చిన పంట నేల వాడటంతో దండమూడి, గాయంవారిపాలెం, ఆరేమండ, మునిపల్లె, నిడుబ్రోలు, జడవల్లి గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు తెలిపారు.