గత నెల 29న ప్రచురించిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తహశీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ అన్నారు. శనివారం తహసిల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నవంబర్, డిసెంబర్ 24వ తేదీన వచ్చిన అభ్యంతరాలను జనవరి 6వ తేదీన ఓటర్ల జాబితాలో ప్రచురిస్తామన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సమీక్ష నిర్వహించారు. డిటి రాజా, రమేష్ మోహన్ పాల్గొన్నారు.