ప్రభుత్వం పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును మరోవారం రోజులు పొడిగించినట్లు పొన్నూరు మండల ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 11 వరకుఎలాంటి అదనపు చెల్లింపులూ లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా దీన్ని ఈ నెల 18 వరకు పొడిగించారని తెలిపారు. అదనపు చెల్లింపు రూ. 500తో డిసెంబరు 10వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు.