రాష్ట్రంలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు చేనేత నాయకులు వినతి పత్రం అందజేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో మంగళవారం మంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నేతలు 17 డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ఆయా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు తెలిపారు.