గుంటూరు: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు

51பார்த்தது
గుంటూరు: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై శుక్రవారం విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఆశచూపి, తన వద్ద రూ.90 లక్షల వరకు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనలాగే చాలా మంది మహిళల జీవితాలను నాశనం చేశారని ఆమె ఆరోపించింది. పోలీసులు, ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది.

தொடர்புடைய செய்தி