మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుంటూరులో కమిషనర్ మాట్లాడుతూ దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర కమిషనర్ కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు. 9440268888 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.