రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల గురించి స్పష్టత ఇవ్వాలని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వాలంటీర్స్ అసోసియేషన్ నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా చైతన్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రూ. 10వేలు జీతం వాలంటీర్లకు ఇస్తామని మోసం చేసిందన్నారు.