మెదరమెట్లలోని ఒకటో సచివాలయం పరిధిలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం జిల్లా టాస్క్ ఫోర్స్ టీం పరిశీలించారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి వారు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నిర్వహించే హెచ్ బి పరీక్ష రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బ్రహ్మానందం, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.