పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని అద్దంకి ఎస్సై ఖాదర్ బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ విధులు, చట్టాలు, నేర పరిశోధన, శిక్షలు అమలు, మొదలగు విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.