గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామ సర్పంచ్ అక్కి నాగరాజు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. సర్పంచ్ అక్కి నాగరాజు మృతికి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులు , గ్రామ కార్యకర్తలు సంతాపం తెలిపారు. పార్టీ బలోపేతానికి సర్పంచ్ నాగరాజు చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.