ఏపీలో పింఛన్ తీసుకునే వారికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు నెలకు ఒకసారి అందిస్తున్న పింఛన్‌ను ఒక నుంచి మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని ప్రకటించారు. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి దగ్గరే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రెండు నెలల పింఛన్ తీసుకోకపోతే మూడో నెల కలిపి తీసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.