షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక జీవో తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేసి ఆదివాసీ విద్యార్థులుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీపీ శాంతికుమారీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం బుట్టయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రవ్వ బసవరాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.