పోలవరం మండల కేంద్రంలో శుక్రవారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారితో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలవరం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. చికెన్ షాపులు వద్ద గుంపులుగా సంచరిస్తూ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై కుక్కలు విరుచుకుపడుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించవలసిందిగా వారు కోరుతున్నారు.