డిసెంబర్ 1న, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్షత్రియ సంక్షేమ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణంలోని, లజపతిరాయ పేటలోని, క్షత్రియ సంక్షేమ పరిషత్తు కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కాస్మో చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాస్మో, క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.