విజయదశమి పండగ సందర్భంగా గత రెండు రోజుల నుండి నూజివీడు పట్టణంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నూజివీడు పట్టణమంతా వాహనాలు రాకపోకలతో రద్దీగా మారింది. మరో పక్క హనుమాన్ జంక్షన్ బస్టాండ్ వద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో అటువైపుగా వాహనాలతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుండి తిరువూరు బస్టాండ్ వరకు వాహనాలతో రోడ్లు నిండిపోయాయి.