చాట్రాయి మండలం, పోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటేశ్వర స్వామి వారిని ఆదివారం మంత్రి కొలుసు పార్థ సారథి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజానీకం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశామన్నారు. అలాగే ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.