నూజివీడు ట్రిపుల్ ఐటీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ వారి సహకారంతో ఎన్. ఎస్. ఎస్, హెల్పింగ్ హ్యండ్స్ ల సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో దాదాపు 100 విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ అమరేంద్ర కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, విద్యార్థులకు రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేసారు.