వశిష్ట గోదావరి నదిలో కార్తీకమాసం స్నానం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోదావరి గట్టును శుభ్రం చేయించాలని, నీరు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మోటార్ల ద్వారా జల్లు స్నానం ఏర్పాట్లు చేయాలని నర్సాపురం మున్సిపల్ కమీషనర్ ఎం అంజయ్య బుధవారం సంభందిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమీషనర్ అంజయ్య మాట్లాడుతు దీపావళి పండుగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళం సంతరించుకుంటోందని పేర్కొన్నారు.