గ్రామపంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచి వారిని ఆదుకోవ డంతోపాటు, తగిన గౌరవం ఇవ్వాలని సామాజిక కార్యకర్త ఎల్. ఎస్. భాస్కర రావు డిమాండ్ చేశారు. మండవల్లి తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ ఎస్)లో మండవల్లి తహసిల్దార్ గోపాల్ కి వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. కార్మికుల కష్టం ఎనలేనిదన్నారు.