కైకలూరు నియోజకవర్గంలో 254 రహదారుల సీసీ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ. 19 కోట్ల 45 లక్షల నిధులను మంజూరు చేసింది. వీటిలో కైకలూరు మండలంలో 66 పనులకు గాను రూ. 4 కోట్ల 50 లక్షలు, కలిదిండి మండలానికి 60 పనులకు గాను రూ. 5 కోట్ల 81 లక్షలు, ముదినేపల్లి మండలానికి 61 పనులకు గాను రూ.4 కోట్ల 49 లక్షలు, మండవల్లి మండలానికి 67 పనులకు గాను రూ.4 కోట్ల 57లక్షలు నిధులను కేటాయించారు. కాగా ముందుగా ప్రతిపాదనలు చేసిన రోడ్లకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.