జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం టీడీపీ మాజీ గ్రామ అధ్యక్షుడు కంకిపాటి నాగరాజు గురువారం విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ నేపథ్యంలో అతడి మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషులు నాగరాజు మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.