వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాలు ముఖ్యపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ జిల్లా ఛాంబర్ నందు రాష్ట్ర సహకార యూనియన్ 71వ అఖిల భారత సహకార వారోత్సవాల గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ అనంతరం ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. నవంబరు 14 నుండి 20 వరకు జిల్లాలో సహకార సంఘాల వారోత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలన్నారు.