ఆచంట మండల రెవెన్యూ అధికారిగా ఎమ్. సోమేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడతానన్నారు. ఈయన గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ఏవోగా పని చేశారు.