పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామం లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఖరీప్ పంట పూత దశకు చేరుకున్న నేపథ్యంలో రైతులు అవసరమైన మేరకే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయశాఖ అధికారిణి జ్యోషిల సూచించారు. అనంతరం స్థానికంగా ప్రధాన సమస్య అయిన గోస్తనీ మురుగు కాలువ త్రవ్వకం చేపట్టాలని, రైతులు అధికారులను కోరారు.