ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో ఆదివారం కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులుగా పని చేస్తున్న ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో కిడ్నీ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పేకేరు గ్రామంలోని సొసైటీ హాస్పిటల్ వేదిక కానుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారని కావున కిడ్నీ రోగులు గమనించాలని సొసైటీ ఆసుపత్రి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.