సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచ్ఛత కార్యక్రమాలు
సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం స్టేషన్ మేనేజర్ ఎం రమేష్, రైల్వే చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ కల్యాణి, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సంతోష్ ల అధ్వర్యంలో.. రైల్వే స్టేషన్లో కేటరింగ్, మూడు ప్లాట్ఫామ్ ల పై ఉన్న స్టాల్స్ తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ తయారీలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, రికార్డు లను తనిఖీ చేసి అన్ని వస్తువులను నిర్ణీత ధరకే విక్రయించాలని పలు సూచనలు చేశారు.