సామర్లకోటలో పలు డ్రైన్లు ఆక్రమణలకు గురికావడంతో డ్రైన్లలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలు నిల్వ ఉండడంతో వర్షం కురిసిన ప్రతిసారి మటం సెంటర్, స్టేషన్ సెంటర్, ప్రెసిడెంట్ వీధి ప్రాంతాల్లో డ్రైన్లు ప్రవాహం లేక వర్షపు నీరు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహిస్తుంది. డ్రైనేజీ వ్యర్థాలతో కూడిన నీరు రోడ్లపై ప్రవహించడంతో ఆ మార్గాన్ని ప్రయాణించే పలువురు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.