రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ రూ. 10 లక్షలు సహాయాన్ని అందజేశారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల తరపున వరద బాధితులకు అండగా ఉంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. పది లక్షల రూపాయల చెక్కును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అందించారు.