రావులపాలెం: మాలల భారీ లాంగ్ మార్చ్ కు ఏర్పాట్లు
రాజ్యాంగాన్ని హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు త్వరలో మాలలు భారీ లాంగ్ మార్చ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా మాల సంఘం ప్రతినిధులు తెలిపారు. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్లో బుధవారం గొల్లపల్లి డేవిడ్ రాజు అధ్యక్షతన జిల్లా మాల సన్నద్ధ సభ సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇసుక పట్ల రఘుబాబు, జంగా బాబురావు, కోట రామ్మోహన్ రావు, నెల్లి లక్ష్మీపతి హాజరయ్యారు.