ఏజెన్సీ ప్రాంతం నుంచి పాత నేరస్తులు మోటార్ సైకిల్ పై గంజాయి రవాణా చేసి రావులపాలెం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని అటువంటి వారిని గుర్తించి పిడి యాక్ట్ నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ ఐజిపి జివిజి అశోక్ కుమార్ హెచ్చరించారు. రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి ఎస్పీ కృష్ణారావుతో కలిసి అశోక్ కుమార్ తనిఖీ చేశారు.