ఆలమూరు: పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
వెన్నెల మరణానికి కారణమైన పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పి కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల తహసిల్దార్, ఎస్సై, ఎం. ఈ. ఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కపల్లి వెన్నెల మృతికి కారణమైన శ్రీ శిరిడి సాయి విద్యానికేతన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.