ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదివారం వాడపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసిన రఘు రామకృష్ణంరాజుకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు.