తుని: అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై బ్లేడుతో దాడి
తుని పట్టణంలోని వీరవరపుపేటకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిందని సీఐ ఎం. గీతా రామకృష్ణ తెలిపారు. బాధిత మహిళ ఇంట్లో ఉండగా అదే ప్రాంతానికి చెందిన అఖిల్ బాబు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. దీంతో ఆమె బ్లేడుతో దాడి చేయడంతో పురుషాంగానికి గాయమవ్వగా పరారయ్యాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు.