కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యకు నిరసనగా జగిత్యాల పాతబస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేనప్పుడు తామెందుకని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రభుత్వమా? అని మండిపడ్డారు.