వివాహిత అదృశ్యంపై తుని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం జన్మభూమి రైలు ఎక్కి విజయవాడకు వేములపూడి గాయత్రి(19) అనే మహిళ 15 నెలల బాబుకి ఆంధ్ర హాస్పిటల్ చికిత్స నిమిత్తం వెళ్లినట్లు తెలిపారు. సాయంత్రం అయిన ఆమె విజయవాడ హాస్పిటల్ కు చేరకపోవడంతో భర్త వీర వెంకటరాజు తుని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.