రాజోలు 'బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు' అని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్ రావు, రాజోలు తహశీల్దార్ ప్రసాద్ సోమవారం బాలుర వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. హాస్టల్ వంట శాల, బాత్రూమ్లు పరిశీలించారు. దీనిపై కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని తెలిపారు.