రంపచోడవరంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండలం ప్రజా పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.