రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బందితో గురువారం ఎంపీడీవో యాదగిరేశ్వరావు సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కావాల్సిన మౌలిక అవసరాలను గుర్తించి ప్రణాళిక రూపొందించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి వివరించారు. తాగునీరు, విద్య, వైద్యం, రహదారుల సదుపాయల కల్పనపై వివరించాలని సూచించారు.